Mummidivaram: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎస్పీ

Mummidivaram: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ రాహుల్ మీనా. శాంతిభద్రతలు, నిఘా మరియు పండుగల బందోబస్తుపై అధికారులకు ఆదేశాలు.

Update: 2026-08-13 14:48 GMT

Mummidivaram: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎస్పీ

ముమ్మిడివరం: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో నేర నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. రోజువారీ విధుల నిర్వహణ, ఎస్‌హెచ్‌ఓ, సీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పోలీసు కార్యకలాపాలు, కేసుల దర్యాప్తు తదితర అంశాలను పరిశీలించారు.

ప్రజలతో పోలీసు అధికారులు క్రమం తప్పకుండా మాట్లాడటం, పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించడం, పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

ముమ్మిడివరం పరిధిలోని ముఖ్యమైన విగ్రహాలు, సున్నిత ప్రాంతాల వద్ద భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను సీసీ కెమెరాలతో కవర్ చేయగా, మిగిలిన ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల కవరేజీని పెంచేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

రానున్న గణేష్ చతుర్థి, దసరా తదితర పండుగల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పండుగల సందర్భంగా పోలీసు శాఖ తరఫున చేపట్టాల్సిన భద్రతా చర్యలు, బందోబస్తు, పర్యవేక్షణపై అధికారులతో చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

మహిళలపై నేరాలు, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయదారులు, గతంలో వినియోగించిన వ్యక్తులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని, జిల్లాలో గంజాయి ప్రాబల్యం పెద్దగా లేదని పేర్కొన్నారు. అయితే గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రజల నుంచి అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

మహిళలకు సంబంధించిన కేసుల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని, క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. కేసులు నమోదైన వెంటనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

మొత్తంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పనితీరు బాగుందని, ఏవైనా లోపాలు లేదా గ్యాప్‌లు ఉంటే వాటిని గుర్తించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముమ్మిడివరం అనంతరం జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లను కూడా ఇన్‌స్పెక్షన్ చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News