Mamidikuduru: మామిడికుదురులో ఏడు అడుగుల భారీ పాము కలకలం!
Mamidikuduru: మామిడికుదురులో 7 అడుగుల భారీ తాడేలు పాము కలకలం. ఇంటి ప్రాంగణంలోకి చొరబడటంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు.
Mamidikuduru: మామిడికుదురులో ఏడు అడుగుల భారీ పాము కలకలం!
Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, మామిడికుదురులో ఆదివారం భారీ తాడేలు పాము కలకలం రేపింది. ఓ ఇంటి ప్రాంగణంలోకి సుమారు ఏడు అడుగులకు పైగా పొడవున్న తాడేలు పాము చొరబడింది.
జనావాసాల మధ్యలోకి భారీ పాము రావడంతో ఇంట్లోని వారు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన గ్రామస్థులు పామును కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.