Kothapeta: అప్పు తీర్చమంటే చంపేస్తామని బెదిరింపులు

Kothapeta: కొత్తపేట నియోజకవర్గం ఈతకోటకు చెందిన పురం వెంకటలక్ష్మి వద్ద రూ.40 లక్షలు అప్పు తీసుకుని బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.

Update: 2026-08-24 09:56 GMT

Kothapeta: అప్పు తీర్చమంటే చంపేస్తామని బెదిరింపులు

కొత్తపేట: కొత్తపేట నియోజకవర్గంలోని ఈతకోటకు చెందిన పురం వెంకటలక్ష్మి తన వద్ద నుంచి అప్పుగా తీసుకున్న రూ.40 లక్షలను తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

గంటి పెదపూడి గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి పద్మరాజు, విజయలక్ష్మి,కుందాలపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ, ఏడుకొండలు వ్యాపారం చేసి లాభాల్లో వాటా ఇస్తామని నమ్మించి తన వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకున్నారని వెంకటలక్ష్మి తెలిపారు.అయితే ప్రస్తుతం మాట మార్చి డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పు చేసి మరీ వారికి డబ్బులు సమకూర్చానని, ఇప్పుడు అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.తనకు న్యాయం చేయకపోతే మరణమే శరణ్యమని కన్నీరుమున్నీరయ్యారు.

తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించడంతో పాటు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వెంకటలక్ష్మి కోరారు.

Tags:    

Similar News