Amalapuram: సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన అవసరం కలెక్టర్!

Amalapuram: ఫిర్యాదుల త్వరిత పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన ముఖ్యం. 22ఏ భూములు, రీ-సర్వేపై అధికారులకు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కీలక ఆదేశాలు.

Update: 2026-09-01 11:52 GMT

Amalapuram: సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన అవసరం కలెక్టర్!

Amalapuram: క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలిస్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరింత సులభమవుతుందని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ డివిజన్, మండల స్థాయి అధికారులకు సూచించారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన అధికారి జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పాయింట్ అధికారులతో 22ఏ నిషేధిత భూములు, రీ-సర్వే, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పీపీబీల పంపిణీ, ఓఆర్‌సీఎం తదితర అంశాలపై సమీక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పీజిఆర్ఎస్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిశీలించిన అనంతరం వెంటనే ఎండార్స్‌మెంట్ రూపంలో వారికి తెలియజేయాలని ఆదేశించారు.

22ఏ నిషేధిత భూములకు సంబంధించిన రీ-సర్వే పనులను వేగవంతం చేసి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రీ-సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి, వివరాలను రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌లో పొందుపరచాలని సూచించారు.

ఆన్‌లైన్ ద్వారా అందుతున్న అర్జీలను కూడా వెంటనే పరిశీలించి, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, ల్యాండ్ రికార్డ్స్ విభాగం, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News