Netflix Free: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ .. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ఫ్రీ

Netflix Free: ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-07-12 05:36 GMT

Netflix Free: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ .. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ఫ్రీ

Netflix: ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దాదాపు ఆరేళ్ల క్రితం నిలిపివేసిన తన మోస్ట్ పాపులర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే కొత్త యూజర్లు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించడంతో స్ట్రీమింగ్ లవర్స్ ఆనందానికి అవధులు లేవు. అయితే, ఈ అదిరిపోయే ఆఫర్ వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ట్విస్ట్‌లు ఉన్నాయి.

సాధారణంగా ఫ్రీ ట్రయల్ అంటే అందరికీ 30 రోజులు ఇస్తారు. కానీ, ఈసారి నెట్‌ఫ్లిక్స్ కాస్త భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం యూజర్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది కొత్త యూజర్లకు 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంటే, మరికొందరికి మాత్రం కేవలం 15 రోజుల ఆఫర్ మాత్రమే కనిపిస్తోంది. వేర్వేరు ప్రాంతాలు, పరికరాలు, అకౌంట్లను బట్టి నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రమోషనల్ ఆఫర్లను మారుస్తూ వస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ సహాయ కేంద్రం సమాచారం ప్రకారం.. ఈ ఆఫర్ అందరికీ నేరుగా అందుబాటులో ఉండదు. మీ లొకేషన్, మీరు వాడుతున్న డివైజ్, మీ అకౌంట్ వివరాల ఆధారంగా మీరు అర్హులైతే.. సైన్-అప్ అయ్యే సమయంలో ఆటోమేటిక్‌గా ఉచిత ట్రయల్ ఆప్షన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ కనిపించకపోతే, ప్రస్తుతానికి మీ అకౌంట్ దానికి అర్హత సాధించలేదని అర్థం.

భారతదేశంలో ఈ ఉచిత ట్రయల్ పునరాగమనం గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ గాడ్జెట్స్ 360 నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఒక కొత్త ఈమెయిల్ ఐడీతో కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రూ. 0కి 30 రోజులు ప్రయత్నించండి అనే ఆఫర్ కనిపించినట్లు స్పష్టమైంది. కాబట్టి భారతీయ వినియోగదారులకు కూడా ఈ లక్ చిక్కే అవకాశం పుష్కలంగా ఉంది.

గతంలో చాలా కాలం పాటు 30 రోజుల ఉచిత ట్రయల్ అందించిన నెట్‌ఫ్లిక్స్, 2020లో ప్రపంచవ్యాప్తంగా దానిని పూర్తిగా నిలిపివేసింది. అప్పటినుంచి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే కంటెంట్ చూసే వీలుండేది. అయితే ప్రస్తుతం ఓటీటీ రంగంలో విపరీతమైన పోటీ పెరగడం, ఇతర ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి గట్టి సవాల్ ఎదురవుతుండటంతో.. కొత్త సబ్‌స్క్రైబర్లను భారీగా ఆకర్షించేందుకు నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఈ పాత అస్త్రాన్ని ప్రయోగించినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News