Nicholas Galitzine: ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్న నికోలస్ గాలిట్జిన్ సినిమా!

Nicholas Galitzine: ప్రఖ్యాత మాట్టెల్ బొమ్మల విశ్వం ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం 'మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్'.

Update: 2026-07-21 06:25 GMT

Nicholas Galitzine: ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్న నికోలస్ గాలిట్జిన్ సినిమా!

Nicholas Galitzine: ప్రఖ్యాత మాట్టెల్ బొమ్మల విశ్వం ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రం 'మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్'. నికోలస్ గాలిట్జిన్, జారెడ్ లెటో, ఇడ్రిస్ ఎల్బా, కమిలా మోండెజ్ వంటి ప్రముఖ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మాత్రం తీవ్ర నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, తాజాగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

థియేట్రికల్ రన్‌లో ఘోరంగా విఫలమైనప్పటికీ, ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూలై 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇకపై ఓటీటీలో ఈ విజువల్ వండర్‌ను వీక్షించవచ్చు.

కథాంశం … తారాగణం

ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నికోలస్ గాలిట్జిన్ హీరోగా ఆడమ్ గ్లెన్ పాత్రలో నటించారు. తన స్వస్థలమైన ఎటర్నియా గ్రహాన్ని దుష్ట శక్తులైన స్కెలెటార్ (జారెడ్ లెటో) బారి నుంచి కాపాడే యోధుడిగా హీ-మాన్ సాహసాలు ఈ చిత్ర కథాంశం. 1987లో డాల్ఫ్ లుండ్‌గ్రెన్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తర్వాత, లైవ్-యాక్షన్ అడాప్టేషన్‌లో తెరకెక్కిన రెండవ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో అలిసన్ బ్రీ, మోರೆనా బక్కరిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నటీనటుల తదుపరి ప్రాజెక్ట్‌లు

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నికోలస్ గాలిట్జిన్ త్వరలోనే 'ది మస్కిటో బౌల్', 'రెడ్, వైట్ & రాయల్ వెడ్డింగ్', 'ది రిటర్న్ ఆఫ్ స్టాన్లీ అట్‌వెల్', 'ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్' వంటి పలు ఆసక్తికరమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లు నిర్మాణ వివిధ దశల్లో ఉన్నాయి.

Tags:    

Similar News