హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి వచ్చేసింది.. కానీ
The Mummy 2026: హాలీవుడ్ క్రేజీ హారర్ డైరెక్టర్ లీ క్రోనిన్ దర్శకత్వంలో, హారర్ చిత్రాల కింగ్స్ జేమ్స్ వాన్ , జేసన్ బ్లమ్ సంయుక్తంగా నిర్మించిన సరికొత్త హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘ది మమ్మీ’.
హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘ది మమ్మీ’ ఓటీటీలోకి వచ్చేసింది.. కానీ
The Mummy 2026: హాలీవుడ్ క్రేజీ హారర్ డైరెక్టర్ లీ క్రోనిన్ దర్శకత్వంలో, హారర్ చిత్రాల కింగ్స్ జేమ్స్ వాన్ , జేసన్ బ్లమ్ సంయుక్తంగా నిర్మించిన సరికొత్త హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘ది మమ్మీ’ కొద్దిరోజుల క్రితమే విదేశాల్లో డిజిటల్ లభ్యతలోకి వచ్చిన ఈ చిత్రం, ఎట్టకేలకు భారతీయ ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది.
రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్.. కానీ అద్దె భారీ గురూ!
ఈ సూపర్ హిట్ హారర్ చిత్రం భారతదేశంలో ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ వేదికలపై విడుదలైంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ,బుక్‌మైషో స్ట్రీమ్ లలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడే ఒక చిన్న తిరకాసు ఉంది. ఈ సినిమాను ఉచితంగా చూసే వీలు లేదు. పే-పర్-వ్యూ (రెంటింగ్) విధానంలో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడాలంటే రూ. 499, అలాగే బుక్‌మైషో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 549 అద్దె రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ రిలీజ్ పరంగా చూసుకుంటే ఈ ధరలు చాలా ఎక్కువనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా మీ సమీప థియేటర్లలో ఇంకా ఆడుతుంటే, వెండితెరపైనే చూడటం మంచి అనుభూతిని ఇస్తుంది.
తెలుగు ప్రేక్షకులకు నిరాశ.. రీజినల్ ఆడియో ట్రాక్స్ లేవు
ఈ ఓటీటీ రిలీజ్‌లో ఉన్న మరో పెద్ద లోపం ఏమిటంటే, ఇందులో తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల ఆడియో ట్రాక్స్ అందుబాటులో లేకపోవడం. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కూడా వచ్చాయి, కానీ ప్రస్తుతానికి ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కేవలం ఇంగ్లీష్ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను చూడాలనుకునే వారు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
లైయా కోస్టా, జాక్ రేనార్, వెరోనికా ఫాల్కన్ , మే కాలమావి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ మిస్టరీని ఒకవేళ మీరు ఇంగ్లీష్ భాషలోనే చూడటానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడే పైన పేర్కొన్న ప్లాట్‌ఫామ్స్ లోకి వెళ్లి అద్దె ప్రాతిపదికన వీక్షించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఓటీటీ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.