Prakasam: ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి.. ఆపై తనే ఉరేసుకున్నాడు!
Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కే.వి. అగ్రహారంలో విషాదం. ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య.
Prakasam: ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి.. ఆపై తనే ఉరేసుకున్నాడు!
ప్రకాశం జిల్లా: చీమకుర్తి మండలం కే.వి. అగ్రహారం గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామానికి చెందిన ఏకుల సుధాకర్ తన కుమార్తెలైన గోఅచ్యుత (11), పూజిత (9), లోహిత (8) లను హతమార్చాడు. అనంతరం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చీమకుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు.
ఈ ఘటనతో కే.వి. అగ్రహారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం.