Markapuram: ప్రభుత్వ వైద్యశాల నర్స్ టి. విజయ జ్యోతికి ఉత్తమ నర్సు పురస్కారం

Markapuram: మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల నర్స్ టి. విజయ జ్యోతికి ఉత్తమ నర్సు పురస్కారం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా అవార్డు అందజేత.

Update: 2026-08-16 08:15 GMT

Markapuram: ప్రభుత్వ వైద్యశాల నర్స్ టి. విజయ జ్యోతికి ఉత్తమ నర్సు పురస్కారం

Markapuram: పట్టణంలోనిప్రభుత్వ వైద్యశాలలో నర్సుగా విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ, అంకితభావంతో రోగులకు సేవలందిస్తున్న టి. విజయ జ్యోతికి ఉత్తమ నర్సుగా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా విజయ జ్యోతి ఈ అవార్డును అందుకున్నారు.

వైద్యశాలలో విధి నిర్వహణలో భాగంగా రోగుల పట్ల సేవా దృక్పథంతో వ్యవహరిస్తూ, వైద్యుల సూచనలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రోగులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా కృషి చేయడం ద్వారా విజయ జ్యోతి ప్రత్యేక గుర్తింపు పొందారు. విధి పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ వైద్యశాఖలో తనదైన సేవలను అందిస్తున్నారు.

ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఉత్తమ నర్సుగా అవార్డు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ రోగులకు మరింత అంకితభావంతో సేవలందిస్తానని తెలిపారు.

ఉత్తమ నర్సుగా పురస్కారం అందుకున్న విజయ జ్యోతిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సహచర ఉద్యోగులు అభినందించారు. ఆమె సేవలకు లభించిన ఈ గుర్తింపు ఇతర సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Tags:    

Similar News