Peddaraveedu: నేరుగా ప్రజల వద్దకే పాలన గూడూరి ఎరిక్షన్ బాబు ధీమా!
Peddaraveedu: ఓబులక్కపల్లిలో జరిగిన “ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.
Peddaraveedu: నేరుగా ప్రజల వద్దకే పాలన గూడూరి ఎరిక్షన్ బాబు ధీమా!
పెద్దారవీడు: పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి గ్రామంలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో నిర్వహించిన “ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ నాయకులు, రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతుల భూ సమస్యలు, ఆన్‌లైన్ నమోదు సమస్యలు, రెవెన్యూ సంబంధిత ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే స్పందించే విధంగా ఒక నెలలో నాలుగు సార్లు గ్రామాలను సందర్శిస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామకృష్ణ, ఎంపీడీవో జాన్ సుందరం, మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క శీను, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు జెడ్డా రవి, మాజీ మండల అధ్యక్షుడు చంద్రగట్ల నాగేశ్వరావు, మండల సీనియర్ నాయకులు దుగ్గెంపూడి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.