Giddalur: సీతారామారావు ప్రభుత్వ సేవలు ఆదర్శనీయం.. ఎమ్మెల్యే

Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కె. సీతారామారావు పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది.

Update: 2026-06-30 13:10 GMT

Giddalur: సీతారామారావు ప్రభుత్వ సేవలు ఆదర్శనీయం.. ఎమ్మెల్యే

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల అభివృద్ధి అధికారి (MPDO) కె. సీతారామారావు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా mpdo కె. సీతారామారావు శ్రీమతి స్వర్ణలత దంపతులకు శాలువా , పూల మాలతో ఘనంగా సత్కరించి ఆయన

మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలో ఎన్నో సంవత్సరాలు ప్రజలకు నిబద్ధతతో సేవలందించిన సీతారామారావు సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా వారు ఆయురారోగ్యాలతో, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , ZPTC బుడతా మధుసుధనరావు,మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News