Markapuram: గిద్దలూరు రైల్వే సమస్యలపై ఎంపీ, అధికారులకు వినతి
Markapuram: కంభం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. గిద్దలూరు నియోజకవర్గ రైల్వే సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతి.
Markapuram: గిద్దలూరు రైల్వే సమస్యలపై ఎంపీ, అధికారులకు వినతి
మార్కాపురం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు కీలకమైన కంభం రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద ఆధునికీకరించేందుకు చేపట్టిన పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ మేనేజర్ శ్రీమతి సుదర్శనా సేన్ (IRS)తో కలిసి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ రైల్వే సమస్యలను ఎంపీ, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి
ఈ క్రింది ప్రధాన డిమాండ్లను వినిపించారు:
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు గిద్దలూరులో హాల్ట్ కల్పించాలనీ రేణిగుంట–నంద్యాల రైలును గిద్దలూరు వరకు పొడిగించాలని గిద్దలూరు–గుంటూరు, గిద్దలూరు–నంద్యాల మధ్య పగటి వేళల్లో కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని
తెనాలి–మార్కాపురం రోడ్ రైలును గిద్దలూరు లేదా నంద్యాల వరకు పొడిగించాలని గిద్దలూరు స్టేషన్‌లో కోచ్ పొజిషన్ డిస్‌ప్లే సిస్టమ్ ఏర్పాటు చేయాలని
దిగువమెట్ట స్టేషన్‌లో ప్రతి రైలుకు తాగునీరు నింపేలా చర్యలు తీసుకోవాలని గిద్దలూరు మీదుగా చెన్నైకి కొత్త రైలు సర్వీస్ ప్రారంభించాలని గిద్దలూరు స్టేషన్‌లో ప్రయాణికుల కోసం చెల్లింపు వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని గిద్దలూరు, కంభం రైల్వే స్టేషన్ ల ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని రైల్వే అధికారులను ఎమ్మెల్యే కోరారు.