Kamareddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి ఎంపీడీఓ!

Kamareddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను MPDO శ్రీనివాస్ పరిశీలించారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతాయని చెప్పారు.

Update: 2026-08-22 05:18 GMT

Kamareddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి ఎంపీడీఓ!

Kamareddy: జుక్కల్ (కామారెడ్డి ) జుక్కల్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వందేమాతరం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తుందని తెలిపారు. గతంలో కొంతమంది లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోయిన ఘటనలు ఉన్నందున, ఎవరినీ ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News