Kamareddy: కేంద్ర మంత్రి కుమారుడి అరెస్ట్ కోసం కాంగ్రెస్ పట్టు!
Kamareddy: కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ రాస్తారోకో చేపట్టాయి.
Kamareddy: కేంద్ర మంత్రి కుమారుడి అరెస్ట్ కోసం కాంగ్రెస్ పట్టు!
కామారెడ్డి: మొహమ్మద్ నగర్ (కామారెడ్డి) కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ను వెంటనే పోలీసులు అరెస్ట్ చెయ్యాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపు మేరకు మొహమ్మద్ నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ప్రజా పండరి ల సమక్షంలో మంగళవారం మొహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద నిజాంసాగర్ - మెదక్, బాన్సువాడ - నిజాంసాగర్ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గం లొ నిరసనలు ఉదృతయ్యాయి.బాధితురాలికి న్యాయం చేయాలి,దోషులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.ఓ మైనర్ బాలికపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం లో చట్టం అందరికి సమానమని,ఎంతటి పెద్ద వారైనా సరే దోషులు అయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఉమ్మడి నిజాంసాగర్ మండలాల గ్రామ సర్పంచ్లు,ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.