Nizamabad: బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం శూన్యం రూరల్ ఎమ్మెల్యే
Nizamabad: బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమం శూన్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి విమర్శించారు. నల్సార్ విద్యార్థులు, ఖర్గే పట్ల వైఖరిని తప్పుపట్టారు.
Nizamabad: బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం శూన్యం రూరల్ ఎమ్మెల్యే
Nizamabad: బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. ఇటీవల నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు కాన్వకేషన్ కార్యక్రమానికి CJI ను ఆ యాజమాన్యం ఆహ్వానించగా పలువురు విద్యార్థులు దానిని తిరస్కరిస్తూ,వర్సిటీ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం తెలిసిందే.
ఇందుకు ప్రధాన కారణం CJP నేతల పట్ల CJI వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి ఆహ్వానాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. ఫలితంగా విద్యార్థుల ఎన్రోల్ మెంట్ ను తీసుకోవద్దని సూచనలు చేయడం అత్యంత హేయమైన చర్య అభివర్ణించారు.అటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఓ ర్యాలీ నిర్వహించగా, దాని తర్వాత బీజేపీ అనుబంధ సంస్థలు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడాన్ని తప్పుబడుతూ.. దళితుల పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఖండించారు.
ఈ అంశమై పార్లమెంట్ లో ఖర్గే ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ఇంత దారుణంగా బీజేపీ ప్రముఖ నాయకుల పట్ల వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని ఖండించారు. రాజకీయ ప్రముఖులకే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంక్షేమం, పారదర్శకత, డిజిటలైజేషన్, జవాబుదారీతనం దిశగా ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఎన్ని ఆర్ధిక క్లిష్ట పరిస్థితులు ఉన్న ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండు జోడెద్దుల్లాగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అనవసర రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ద్వారా ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు చేరువ అవుతున్నాయని అన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా ఆ దిశగా మరో కీలక అడుగు పడుతోందని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, బాల్ రాజు, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమ్మాజి నరేష్, రాంచందర్ గౌడ్, బోర్గం శ్రీనివాస్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.