Kamareddy: పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు

Kamareddy: కామారెడ్డి జిల్లా సరంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కొడుకు పెళ్లికి వెళ్తుండగా కల్వర్టును ఢీకొట్టిన కారు.

Update: 2026-05-06 09:34 GMT

Kamareddy: పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు

Kamareddy: కొడుకు పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి కారులో వెళుతుండగా రోడ్డు ప్రక్కన ఉండే కల్వర్టు డివైడర్ ను కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన సిద్ధిరాములు కుమారుడు భరత్ వివాహం కామారెడ్డి లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈరోజు ఉదయం 12 గంటలకు జరగనుంది.

ఈ నేపథ్యంలో సిద్ధి రాములు తన 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి కి కారులో బయలుదేరాడు. సరిగ్గా కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామ శివారులోకి రాగానే రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టు డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న సుజాత, సిద్దిరాములు, వినోద, సునీత లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో సుజాత పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News