Kamareddy: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్సై ఆంజనేయులు!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజంపేట ఎస్సై ఆంజనేయులు ₹30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Update: 2026-08-20 18:09 GMT

Kamareddy: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్సై ఆంజనేయులు!

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రాజంపేట ఎస్సై ఆంజనేయులు. సిమెంట్ దుకాణం వ్యవహారంలో సిద్ధిరాములు నుంచి 50 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ ఆంజనేయులు.

ముందుగా సిద్ధిరామలు నుంచి పదివేలు తీసుకున్న ఎస్సై ఆంజనేయులు. ఈరోజు మధ్యాహ్నం కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని ఎస్సై నివాసంలో మరో 30000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎస్సై నివాసంలో ఫైళ్లను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు. తీసుకు సంబంధించి వివరాలపై విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ అధికారులు.

Tags:    

Similar News