Bodhan: బోధన్ ఇక్రా పాఠశాల దౌర్జన్యం.. ఆర్డీవోకు తండ్రి ఫిర్యాదు!

Bodhan: బోధన్ ఇక్రా పాఠశాల టీసీ ఇవ్వడం లేదని ఆర్డీవో ప్రజావాణిలో తండ్రి ఫిర్యాదు. ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు పాఠశాల యాజమాన్యం వేధింపులు.

Update: 2026-08-24 05:12 GMT

Bodhan: బోధన్ ఇక్రా పాఠశాల దౌర్జన్యం.. ఆర్డీవోకు తండ్రి ఫిర్యాదు!

Bodhan: ప్రయివేట్ పాఠశాలల దౌర్జన్యాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. బోధన్ పట్టణంలోని ప్రకాష్ పేటలో గల ఇక్రా పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని తండ్రి ఆర్డీవోకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కోటగిరి మండలం చెందిన ఆసిఫ్ తన కూతుర్ని బోధన్ పట్టణంలోనిఇక్రా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న షేక్ తాజ్రూమ్ ను స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు.

ఫీజుల భారం మోయలేక ఉన్నత చదువులు చదివించే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో తన కూతుర్ని చేర్పించానని తన కూతురు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తో పాటు ఇతర సర్టిఫికెట్లు ఇవ్వాలని పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ ను వేడుకుని కాలు మొక్కిన కనికరించకుండా ససేమిరా అంటూ బెదిరించి నీ దిక్కున చోట చెప్పుకోవాలంటూ పాల్పడ్డాడని ప్రజావాణిలో పేర్కొన్నాడు.

ముఖ్యమంత్రి వచ్చి చెప్పిన సర్టిఫికెట్లు ఇవ్వనని ధాబాయిస్తువాడని యిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థి తండ్రి ఆర్డివో విజయ్ కుమార్ కి సమస్యను విన్నవించాడు. సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, తన కూతురు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇప్పించాలని విన్నవించాడు.

Tags:    

Similar News