Nizamabad: జానకంపేట కల్లు దుకాణంపై ఈగల్ టీం ఆకస్మిక దాడులు!

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలోని కల్లు దుకాణాలపై అధికారులు జరుపుతున్న దాడులు కల్లు విక్రయ దారులను హడలెతిస్తున్నరు. కల్లులో కల్తీ చేస్తఉన్నారని సమాచారం ఇస్తే చాలు ఆ కల్లు దుకాణం పై అధికారులు ఎడపల్లి జాన్కంపేటలో ఈగల్దాడులు నిర్వ హించి శాంపిల్ సేకరించి ఒకరిపై కేసు నమోదు చేశారు. జానకంపేటలో రెండు కళ్ళు దుకాణం నిర్వహిస్తున్నప్పటికీ ఒక్కరికి మాత్రమే అనుమతి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

జిల్లాలోని ఈగల్ టీం తో పాటు స్పెషల్ టీం తో కలిసి కళ్ళు దుకాణాలపై దాడులు జరిపి. దాడుల సమయంలో కల్లు దుకాణంలో కల్లు శాంపిల్స్ సేకరించే పని లేకుండా కల్లు తాగిన వ్యక్తుల మూత్రం శాంపిల్స్ సేకరించి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. కళ్ళు కల్తీదా కాదా అనే విషయాన్ని నిర్ధారించి కల్లు కల్తీ తేలడంతో నారగోడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పూర్ణేశ్వర్ వెల్లడించారు.

కల్లులో కల్తీ జరిగినట్టు తేలితే వెంటనే ఆ కల్లు దుకాణం పై కేసు నమోదు చేసి దుకాణం నిర్వహకుడిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంటున్నారు. దీంతో కల్లు దుకాణాల యజమానులు ఇలాంటి చర్యలు చూసి అడలెత్తిపోతున్నారు. ఈ తరహ కేసులను ఇప్పటివరకు అధికారులు రెండు ప్రదేశాలలో నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఒకటి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఒక కేసు నమోదు చేశారు.

ఈగల్ టీం ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ స్థానిక పోలీసుల సమక్షంలో ఇలాంటి చర్యలు చేపట్టి కల్లు ను కల్తీ చేయకుండా అధికారులు హుక్కు పాదం మోపుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలో సోమవారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో జిల్లా స్పెషల్ ఫోర్స్ పోలీసులు కల్లు డిపోపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు.

ఈ సందర్బంగా వారు కల్లు దుకాణంలో కల్లు సేవించిన కొందరికి మూత్ర పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో తాగిన కల్లులో ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు నిర్ధారణ జరిగింది.దీంతో ఈగల్ టీం సీఐ పూర్ణేశ్వర్ పర్యవేక్షణలో, ఎస్సై సందీప్ కల్లు దుకాణం యజమానిపై కేసునమోదు చేశారు. ఈ దాడులలో ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ కూడా పాల్గొన్నారు. మత్తు పదార్థాల కల్తీని అరికట్టేందుకు కల్లు దుకాణాలపై ఆకస్మిక దాడులు జరుపుతున్నట్టు సిఐ పూర్ణేశ్వర్ తెలిపారు.

కల్లు కల్తీ చేసినా , అక్రమంగా మత్తు పదార్దాలు కలిగి వున్నా, కల్లు ను కల్తీ చేసినా కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అక్రమ మత్తు పదార్థాల విక్రయాలు, కల్తీ కల్లు తయారీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజారోగ్యం, యువత భవిష్యత్తు పరిరక్షణకు ఈగల్ టీమ్, జిల్లా స్పెషల్ ఫోర్స్ పోలీసుల నిర్వరామంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Tags: