Kamareddy: బిచ్కుంద మండలంలో వేగంగా వంతెన నిర్మాణ పనులు

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం తక్కడ్ పల్లి గ్రామ శివారులో రూ. 35 లక్షల ఉపాధి హామీ నిధులతో హై లెవల్ బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి.

Update: 2026-05-18 10:50 GMT

Kamareddy: బిచ్కుంద మండలంలో వేగంగా వంతెన నిర్మాణ పనులు

Kamareddy: తక్కడ్ పల్లి (కామారెడ్డి) బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్ పల్లి - బిచ్కుంద మార్గమధ్యలో తక్కడ్ పల్లి గ్రామ శివారులో 35 లక్షల నిధులతో చేపట్టుతున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టుతున్న బ్రిడ్జి నిర్మాణం పనులు ఈ పనులు త్వరలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల ఉప అధ్యక్షుడు రవి పాటిల్ తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతే ఈ గ్రామం మీదుగా 161సంగారెడ్డి - నాందేడ్, ఆకోల జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ కు వెళ్లేందుకు 10 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థానిక నాయకులు రవి పాటిల్, హనుమంత్ పాటిల్ లు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చురుకుగా సాగేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వార నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో చిన్న తక్కడ్ పల్లి వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం తో ప్రతి వర్షాకాలం లో చిన్న తక్కడ్ పల్లి - బిచ్కుంద కు రాకపోకలు నిలిచి పోయే అవకాశం ఉండేదని ఎగువ భాగంలో ఉన్న కౌ లాస్ నాల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో రాకపోకలు స్తంభించి పోయేవని బ్రిడ్జి నిర్మాణం తో ఆ ఇబ్బందులు తీరి పోయాయని ఇప్పుడు నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం తో రాకపోకలకు సౌకర్యం ఏర్పడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News