Nellore: కోటి రూపాయల నకిలీ నోట్ల దందాలో ఇద్దరు పోలీసుల అరెస్ట్!
Nellore: భారీ మోసం. 10 లక్షల అసలు నోట్లకు కోటి నకిలీ నోట్లు ఇస్తామని తమిళనాడు వ్యాపారులను పిలిపించి దోచుకున్న ట్రాఫిక్ ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్.
Nellore: కోటి రూపాయల నకిలీ నోట్ల దందాలో ఇద్దరు పోలీసుల అరెస్ట్!
నెల్లూరు: గంగధర నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం లో ఘరానా మోసం.. పోలీసులే దొంగలుగా మారిన వైనం 10 లక్షల అసలు నోట్లకు.. రూ. కోటి నకిలీ నోట్లు ఇస్తామంటూ ఖాకీల ఎర. తమిళనాడు వ్యాపారులను నమ్మించి పిలిపించి, బెదిరించి రూ. 10 లక్షలు దోపిడీ. దోపిడీ ముఠాలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్సై లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి..
ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. బాట్టుకండిగ గ్రామం వద్ద నిందితులను అదుపులో కి తీసుకున్న జీడీ నెల్లూరు పోలీసులు. కొబ్బరికాయల వ్యాపారం పేరిట వచ్చి దోచుకున్నారంటూ మొదట బాధితుల డ్రామా. విచారణలో నకిలీ నోట్ల మార్పిడి దందా అసలు రంగు బయటపెట్టిన జిడినెల్లూరు పోలిసులు.