Nellore: పీడీ యాక్ట్ నుంచి విడుదలైన 3 రోజులకే రౌడీషీటర్ కమ్మ సాయి హత్య

Nellore: నెల్లూరు ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో రౌడీషీటర్ కమ్మ సాయి దారుణ హత్య. పీడీ యాక్ట్ జైలు నుంచి విడుదలైన 3 రోజులకే దుండగులు వెంటాడి బండరాయితో కొట్టి హత్య చేశారు.

Update: 2026-08-31 07:36 GMT

Nellore: పీడీ యాక్ట్ నుంచి విడుదలైన 3 రోజులకే రౌడీషీటర్ కమ్మ సాయి హత్య

Nellore: నెల్లూరు నగరం మరోసారి ఉలిక్కిపడింది. రాత్రివేళ హర్రర్ సినిమాని తలపిస్తూ కొందరు గుర్తు తెలియని దుండగులు కమ్మసాయి అనే రౌడీషీటర్ ను అత్యంత వాసివికంగా కిరాతకంగా వెంటాడి వేటాడి హత్య చేశారు. దుండగులు వెంటాడడంతో కొంత దూరం పరిగెత్తి ఆర్టీవో ఆఫీస్ సమీపంలో కుప్పకూలిన రౌడీ షీటర్ కమ్మసాయి బలమైన బండరాయివేసి హతమార్చారు.

మృతుడు కమ్మసాయి నగరంలోని చంద్రమౌళి నగరకు చెందిన యువకుడు. ప్రశాంతమైన ఆర్టీవో ఆఫీస్ సమీపంలో జరిగిన దారుణ హత్యతో ఆ ప్రాంతం తీవ్ర కలవరపాటుకు గురైంది సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న ఐదవ పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతుని హతమార్చిన వారికోసం పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు నగరంలోని ఇద్దరు అదనపు ఎస్పీలు రూరల్ డిఎస్పి 6 మంది సీఐలు సహా సిసిఎస్ నేర విభాగ సిఐలు సంఘటన స్థలంలో హత్యపై ఆరాధిస్తున్నారు.

హత్యకు గురైన కమ్మ సాయి పై పలు హత్య హత్యయత్నం దౌర్జన్యం కేసులు ఉన్నాయి రౌడీ షీటర్ గా రికార్డులుకెక్కిన కమ్మ సాయి పీడీ యాక్ట్ తో జైలు నుంచి గత మూడు రోజుల క్రితం విడుదలైనట్లు సమాచారం.

Tags:    

Similar News