Marripadu: చుంచులూరులో నూతన బస్సు షెల్టర్ ప్రారంభం
Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరులో దాతల సహకారంతో పునర్నిర్మించిన నూతన బస్సు షెల్టర్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు.
Marripadu: చుంచులూరులో నూతన బస్సు షెల్టర్ ప్రారంభం
మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు గ్రామంలో ప్రజల సౌకర్యార్థం నూతనంగా పునర్నిర్మించిన బస్సు షెల్టర్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. చింతంరెడ్డి సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు దాదాపు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్సు షెల్టర్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది.
దీంతో ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు,మహిళలు,విద్యార్థులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఈ సమస్యను గుర్తించిన చింతంరెడ్డి సిద్ధారెడ్డి,చింతంరెడ్డి.సురేష్ కుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి,పాత బస్సు షెల్టర్‌ను పునర్నిర్మించారు.
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సౌకర్యాలతో నూతన రూపంలో బస్సు షెల్టర్‌ను నిర్మించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రామ ప్రజల సమక్షంలో ఎంతో వేడుకగా జరిగింది.
చింతంరెడ్డి కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తూ,ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.షుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన బస్సు షెల్టర్‌ను అదే కుటుంబం తిరిగి పునర్నిర్మించడం పట్ల గ్రామస్తులు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చింతం రెడ్డి సిద్ధారెడ్డి,చింతం రెడ్డి సురేష్ కుమార్ రెడ్డి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.