Nellore: నెల్లూరులో కమిషనర్ గర్జన.. సచివాలయ సిబ్బందికి చుక్కలు!
Nellore: నెల్లూరు నగర కమిషనర్ వై.ఓ. నందన్ సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టారు.
Nellore: నెల్లూరులో కమిషనర్ గర్జన.. సచివాలయ సిబ్బందికి చుక్కలు!
నెల్లూరు: సచివాలయం సిబ్బందిపై కొరడా జులిపిస్తున్నారు నెల్లూరు నగర కమిషనర్ వై.ఓ. నందన్. నెల్లూరు జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 14 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు కమిషనర్ వై.ఓ నందన్ .. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ షేక్ షాజీర్ ను విధుల నుంచి తొలగిస్తూ నోటీసులు జారీ చేశారు.
జనగణన 2027 పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సెన్సస్ పనులను బేఖాతరు చేసిన ఎన్యుమరేటర్లపై ఉక్కుపాదం మోపారు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్. నోటీసులు అందుకున్న వారిలో పలువురు వార్డు అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు. ఊహించని ఈ పరిణామంతో సచివాలయం ఉద్యోగులతో పాటు మిగతా ఉద్యోగ సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. నగర కమిషనర్ వై.ఓ.నందన్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయం వెలువడుతుంది.