Kaluvoya: మాదాసు నలినమ్మను సత్కరించిన కలువాయి జడ్పీటీసీ దంపతులు!
Kaluvoya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం సతీమణి నలినమ్మను కలువాయి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు ఆరవ లిఖిత దంపతులు సత్కరించారు.
Kaluvoya: మాదాసు నలినమ్మను సత్కరించిన కలువాయి జడ్పీటీసీ దంపతులు!
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు లో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం సతీమణి నలినమ్మ ను కలువాయి మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ సభ్యురాలు ఆరవ లిఖిత కుటుంబ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నలినమ్మ ను శాలువా కప్పి సత్కరించారు. మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కలువాయి మండలం నుంచి లిఖిత టీడీపీ తరువున పోటీ చేశారు.
ఆమె ఘన విజయానికి మాదాసు గంగాధరం, నలినమ్మ లు కృషి చేశారు. వారు చేసిన కృషి కి లిఖిత తన భర్త డాక్టర్ రాజేష్, తో కలిసి మాదాసు కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా నలినమ్మ వారిని అభినందించారు. జడ్పీటీసీ తో పాటు టీడీపీ మండల సీనియర్ నాయకులు అరిబోయిన మల్లికార్జున యాదవ్ ఉన్నారు.