బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పీడ్.. 20 ఏళ్ల సమస్యలకు చెక్!
Buchireddypalem: బుచ్చిరెడ్డిపాలెంలో రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పీడ్.. 20 ఏళ్ల సమస్యలకు చెక్!
Buchireddypalem: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 16 వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన 4 వ వార్డులో నూతనంగా నిర్మించిన గూడపల్లి కాలువ ప్రారంభం.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఐ లవ్ బుచ్చి ఎల్ఈడి బోర్డులను ప్రారంభించిన ఎమ్మెల్యే టిడిపి శ్రేణులతో పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని బుచ్చిరెడ్డిపాలెం కూటమి ప్రభుత్వం వచ్చిన 24 నెలలు లోనే ఎంతో అభివృద్ధి చెందింది అని అన్నారు.20 సంవత్సరాలుగా మట్టి తోలడం తప్ప రోడ్డు వేయలేదు వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం 2 కోట్ల తో సీసీ రోడ్డికి శంకుస్థాపన చేశాం.24 నెలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ను అమలు చేస్తున్నాం.
16 వేల మంది నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించాము అన్నారు.కూటమి ప్రభుత్వం లో రైతులు సంతోషం గా ఉన్నారు.24 గంటల లో రైతులకు ఖాతాలో డబ్బులు జామ చేశాం అన్నారు.వైసీపీ ప్రభుత్వం లో ఇచ్చిన జగనన్న కాలనిలో అవినీతి జరిగింది అని పోలం కొనేటప్పుడు, పోలం లేవలింగ్ చేసేటప్పుడు వైసీపీ ప్రభుత్వం అవినీతి చేసింది అని తెలియజేసారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు నిలబడడానికి భయపడేలా నాయకులు పనిచేయాలి,అన్ని స్థానాలు ఏకగ్రీవంగా అయ్యేలా చూడాలి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి బూత్ ఇంచార్జ్ లు ఓట్ల జాబితాను పరిశీలించాలి ఎక్కడ అవకతవకలు జరగకుండా చూడాలని నాయకులు,కార్యకర్తలు కు సూచనలు చేశారు.