Gudur: పోలీసుల కస్టడీ నుంచి జీవిత ఖైదీ పరార్!

Gudur: తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో కడప జైలుకు తరలిస్తున్న జీవిత ఖైదీ సాకే రాజ్ కుమార్ గూడూరు వద్ద పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.

Update: 2026-06-12 06:23 GMT

Gudur: పోలీసుల కస్టడీ నుంచి జీవిత ఖైదీ పరార్!

Gudur: పోలీసుల కస్టడీలో నుంచి జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి రైలులో ఎస్కార్ట్ పోలీసుల కళ్ళు కప్పి పరారైన సంఘటన గురువారం వేకువ జామున గూడూరు రైల్వే స్టేషన్లో చోటు చేసుకోగా పోలీసులు.

ఈ విషయాన్ని సాయంత్రం వరకు గోప్యంగా ఉంచారు. అనంతరం ఎస్కార్ట్ కానిస్టేబుల్ దస్తగిరి గూడూరు రైల్వే పోలీసులకు పిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. వారి వివరాల మేరకు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సాకే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఫోక్సో కేసులో నిందితుడిగా ఉండగా అతనికి కోర్టు జీవిత ఖైదు విదించి కడప జైలులో ఉంచారు. అయితే ఇటీవల కాలంలో అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంగా అతనిని వైజాగ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో అతనిని బుదవారం సాయంత్రం కడప జైలుకు తరలించే క్రమంలో తిరుమల ఎక్స్ప్రెస్ ఖైదీతో పాటుగా నలుగురు ఎస్కార్ట్ సిబ్బంది కే బాలక్రిష్ణారెడ్డి, ఎస్ పురుషోత్తం. వీ దస్తగిరి, సీ రాజాలతో కలసి బీ-1 కోచ్లో బయలు దేరారు. గురువారం వేకువ జామున గూడూరు రైల్వే స్టేషన్ వచ్చే సరికే కోచ్లో ఎస్కార్ట్ మద్యలో ఉన్న ఖైదీ పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు.

గమనించిన ఎస్కార్ట్ పోలీసులు గూడూరు పరిసర ప్రాంతా లలో గాలింపు చేపట్టినప్పటికీ ఎక్కడా ఆచూకీ కనిపించక పోవడంతో సాయంత్రం వారు గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకొని అతని పోటోతో కూడిన వివరాలతో రైల్వే పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు గూడూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

Tags:    

Similar News