Nellore: నెల్లూరులో ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు!

నెల్లూరు: నగరంలోని ఎంపీ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది.

ఈ వేడుకల్లో నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు పాల్గొని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఎంపీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

Tags: