Marripadu: విధుల్లో ఉండగానే గుండెపోటు.. నేలకొరిగిన నెల్లూరు వీర జవాన్!
Marripadu: మహారాష్ట్రలో విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణించిన నెల్లూరు జిల్లా సింగనపల్లికి చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ నూకంరెడ్డి శేఖర్ రెడ్డి
Marripadu: విధుల్లో ఉండగానే గుండెపోటు.. నేలకొరిగిన నెల్లూరు వీర జవాన్!
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలంలోని సింగనపల్లి గ్రామానికి చెందిన నూకంరెడ్డి శేఖర్ రెడ్డి మహారాష్ట్రలో జవాన్ గా పనిచేస్తూ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు, అధికారులు తెలిపారు. సింగనపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి మహారాష్ట్రలో గచ్చిరోలిలోని అహెరిలో సిఆర్పిఎఫ్ 9వ బెటాలియన్ ఏఎస్ఐగా పని చేస్తున్నాడు. ఈ తరుణంలో విధులు నిర్వహిస్తుండగా ఆ రాష్ట్రక్యాంపు కార్యాలయంలో గుండెపోటుతో మృతి చెందాడు.
ఈ తరుణంలో సైనిక లాంఛనాలు పూర్తిచేసుకుని శుక్రవారం స్వగ్రామైన సింగనపల్లికి ఆయన పార్ధివ దేహాన్ని తీసుకు వచ్చారు. మృతి చెందిన వీర జవాన్ శేఖర్ రెడ్డికి భార్య, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. స్వగ్రామం చేరుకున్న వీర జవాన్ పార్థివ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒక్కసారిగా వీర జవాన్ మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం సంబంధిత అధికారులు సైనిక లాంచనాలతో కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.