Nellore: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్!
Nellore: నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశేష సేవలకు గాను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడలో గోల్డ్ మెడల్ అందజేశారు.
Nellore: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్!
నెల్లూరు: నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) నెల్లూరు జిల్లా శాఖ అందించిన విశేష సేవలు, సాధించిన ప్రగతికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ ను అందజేశారు.
సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈ గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు.
నెల్లూరు జిల్లా ఐఆర్‌సీఎస్ శాఖలో మొత్తం 2,097 మంది లైఫ్ మెంబర్లు నమోదు చేసుకున్నారు. అదే కాలంలో వివిధ రక్తదాన శిబిరాల ద్వారా 15,747 యూనిట్ల రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అందుబాటులో ఉంచడంలో జిల్లా శాఖ విశేష కృషి చేసింది.
ఐఆర్‌సీఎస్ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రక్తదాన కార్యక్రమాల విస్తరణ, లైఫ్ మెంబర్ల నమోదు తదితర అంశాల్లో జిల్లా శాఖ సాధించిన ప్రగతికి గుర్తింపుగా గవర్నర్ గోల్డ్ మెడల్ లభించడం పట్ల జిల్లా అధికారులు, ఐఆర్‌సీఎస్ సభ్యులు, వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.