Udayagiri: ఉదయగిరి సీఐగా బాధ్యతలు స్వీకరించిన బొప్పన అంకమ్మరావు!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బొప్పన అంకమ్మరావు బాధ్యతలు స్వీకరించారు.శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణే లక్ష్యమనిపేర్కొన్నారు.

Update: 2026-08-10 05:57 GMT

Udayagiri: ఉదయగిరి సీఐగా బాధ్యతలు స్వీకరించిన బొప్పన అంకమ్మరావు!

Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బొప్పన అంకమ్మరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సీఐడీ కార్యాలయం నుంచి బదిలీపై ఉదయగిరికి వచ్చిన ఆయన, అధికారికంగా సీఐగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఉదయగిరి పోలీస్‌ సిబ్బంది నూతన సీఐ అంకమ్మరావుకు స్వాగతం పలికారు.

సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సీఐ తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.

ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీఐ అంకమ్మరావు కోరారు.

Tags:    

Similar News