Nellore: ఏఎస్ పేట PHC ఉద్యోగి అక్రమాలు రిటైర్మెంట్‌తో గుట్టు రట్టు
Nellore: నెల్లూరు ఏఎస్ పేట పిహెచ్‌సి ఉద్యోగి అక్రమ రీడిప్యుటేషన్ వ్యవహారం బహిర్గతం. మూడేళ్లు పనిచేయకుండానే వేతనాలు డ్రా. విచారణకు గ్రామస్థుల డిమాండ్.
Nellore: ఏఎస్ పేట PHC ఉద్యోగి అక్రమాలు రిటైర్మెంట్‌తో గుట్టు రట్టు
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట ప్రభుత్వ వైద్యశాలలో చీర్ల కాంతయ్య, అనే ఓ ఉద్యోగి జీవో 143 ను అడ్డంపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.అసలు పనిచేయాల్సిన చోట కాకుండా,గత మూడు సంవత్సరాలుగా మరో ప్రాంతంలో మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నట్లు చూపించి వేతనాలు డ్రా చేసుకున్నారు.
మూడేళ్లగా సాగిన ఈ గుట్టు శుక్రవారం రిటైర్డ్ ఫంక్షన్ తో బయట ప్రపంచానికి తెలిసింది. అయితే గత మూడేళ్లుగా ఏ ఎస్ పేట పిహెచ్సి పరిధిలో అతను చేయాల్సిన రికార్డులను ఎవరు మెయింటినెన్స్ చేశారు. అనేదాన్ని స్థానిక ప్రభుత్వాధికారులు గోప్యంగా ఉంచారు.
స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది కొరత ఉన్నా కూడా అధికారులు రీడిప్టేషన్ ఏ విధంగా అతనికి ఇచ్చారనే దానిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంబంధిత అధికారి ఎటువంటి చర్యలు లేకుండానే ప్రశాంతంగా రిటైర్డ్ కావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై,లబ్ధి పొందిన రిటైర్డ్ ఉద్యోగిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని స్థానికులు, కోరుతున్నాయి...స్థానిక వైద్యాధికాలను వివరణ కొరకు చరవాణిలో సంప్రదించగా వారు అందుబాటులో రాలేదు..