Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో వైభవంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం!
Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Nellore: నెల్లూరు కలెక్టరేట్‌లో వైభవంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం!
నెల్లూరు: నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన భవన్‌లో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య తదితరులు హాజరయ్యారు.
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నేతన్న సేవలో పథకం ద్వారా 4,793 మంది చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున బాపట్లలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమ చేశారు.చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చేనేత కార్మికులు దేశానికి పట్టుకొమ్మలని, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి, భారతదేశ ఖ్యాతిని పెంచే అలుపెరుగని శ్రమ యోధులని పేర్కొన్నారు.