Space Crash: ఊహించని విపత్తు..చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్..!

SpaceX Falcon: అంతరిక్షంలో ఒక అరుదైన , సంచలనాత్మక సంఘటన చోటుచేసుకుంది.

Update: 2026-08-07 02:15 GMT

Space Crash: ఊహించని విపత్తు..చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్..!

SpaceX Falcon: అంతరిక్షంలో ఒక అరుదైన , సంచలనాత్మక సంఘటన చోటుచేసుకుంది. మన పొరుగున ఉన్న చంద్రుడిపై స్పేస్-ఎక్స్ సంస్థకు చెందిన ఒక భారీ రాకెట్ భాగం ప్రచండ వేగంతో పడిపోవడంతో అక్కడ పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి.

2025 జనవరి 15న స్పేస్-ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్, ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ బ్లూ ఘోస్ట్ వంటి లూనార్ ల్యాండర్లను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మిషన్ పూర్తయిన తర్వాత ఈ రాకెట్ యొక్క అప్పర్ స్టేజ్ అంతరిక్షంలోనే వ్యర్థంగా మిగిలిపోయింది. అంతరిక్షంలో సూర్యకాంతి , వివిధ గ్రహాల గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం వల్ల ఈ రాకెట్ భాగం యొక్క కక్ష్య ఊహించని విధంగా మారిపోయింది. క్రమంగా అది చంద్రుడి వైపు దూసుకెళ్లడం ప్రారంభించింది.

ఆగస్టు 5న సుమారు 4 టన్నుల బరువున్న ఈ రాకెట్ భాగం గంటకు ఏకంగా 8,700 కిలోమీటర్ల ప్రచండ వేగంతో చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ క్రేటర్ సమీప ప్రాంతాన్ని అత్యంత శక్తివంతంగా ఢీకొట్టింది. ఈ ధాటికి చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన తాకిడి జరిగి ధూళి, రాళ్లు పెద్ద ఎత్తున గాల్లోకి లేచాయి. నాసా ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ ఇంపాక్ట్ వల్ల చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుగల ఒక భారీ గోయి ఏర్పడింది.

ఈ ఆసక్తికర ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధనా సంస్థలు నిశితంగా గమనించాయి. టెలిస్కోప్ ద్వారా ఢీకొన్న ప్రాంతంలో సోడియం, లిథియం వాయువుల సంకేతాలను గుర్తించింది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఈ ఆర్బిటర్ కొత్తగా ఏర్పడిన క్రేటర్ ఫోటోలను ఎంతో స్పష్టంగా చిత్రీకరించింది.

ఈ అనుకోని ఘటన వల్ల భూమికి లేదా మానవాళికి ఎలాంటి ముప్పు లేదని, గతంలో కూడా ఇలాంటి రాకెట్ భాగాలు లేదా వ్యర్థాలు చంద్రుడిని ఢీకొట్టిన సంఘటనలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఏది ఏమైనా, మానవుడు తయారు చేసిన ఒక పరికరం చంద్రుడి ఆకారాన్నే మార్చి కొత్త గుర్తును మిగిల్చడం సైన్స్ ప్రపంచంలో విశేషంగా నిలిచింది.

Tags:    

Similar News