రైలులో ఖాళీ సీటు ఉంటే టికెట్ మీదే.. 10 గంటల ముందు ఎలా బుక్ చేసుకోవాలంటే?
Current Ticket Booking: రైలులో కన్ఫర్మ్ టికెట్ దొరకలేదని బాధపడకండి! చార్టు తయారయ్యాక ఖాళీ సీట్లపై కరెంట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. IRCTC యాప్, వెబ్సైట్లో ఎలా బుక్ చేయాలో, పేమెంట్ ఆప్షన్లు ఏంటో ఓసారి చూద్దాం..!
రైలులో ఖాళీ సీటు ఉంటే టికెట్ మీదే.. 10 గంటల ముందు ఎలా బుక్ చేసుకోవాలంటే?
Current Ticket Booking: రైలు ప్రయాణానికి కన్ఫర్మ్ టికెట్ దొరకలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కరెంట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైలు చార్టు తయారైన తర్వాత మిగిలిన ఖాళీ సీట్లపై ఈ టికెట్ బుక్ అవుతుంది.
కరెంట్ టికెట్ ఎలా బుక్ చేయాలి?
కరెంట్ టికెట్ కోసం IRCTC వెబ్సైట్ లేదా యాప్ వాడుకోవచ్చు. అందులో ప్రయాణ ప్రదేశం, రైలు వివరాలు నమోదు చేయాలి. తర్వాత ఖాళీ సీట్ల సమాచారం కనిపిస్తుంది. ముందుగా IRCTC యాప్ లేదా వెబ్సైట్ తెరిచి మీ అకౌంట్లోకి లాగిన్ కండి.
బుకింగ్ సమయం ఎప్పుడు?
కరెంట్ టికెట్ బుకింగ్ సమయం రైలు తొలి రిజర్వేషన్ చార్టుతో ముడిపడి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని రైళ్ల తొలి చార్టు కనీసం 10 గంటల ముందే తయారు చేస్తారు. ఆ తర్వాత ఖాళీ సీట్లపై కరెంట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
రైలు సెర్చ్ చేసిన తర్వాత అందులో ఖాళీ సీట్ల వివరాలు చూడండి. సీటు అందుబాటులో ఉంటే కరెంట్ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత ప్రయాణికుడి వివరాలు నింపి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
పేమెంట్ ఎలా చేయాలి?
కరెంట్ టికెట్ బుకింగ్‌లో పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి. UPI, డెబిట్ కార్డు లేదా ఇతర అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించవచ్చు. పేమెంట్ పూర్తవగానే టికెట్ బుక్ అవుతుంది.
గుర్తుంచుకోండి, కరెంట్ టికెట్ బుకింగ్ చార్టు తయారైన తర్వాత మిగిలిన సీట్లకే వర్తిస్తుంది. దీని లభ్యత రైలు, స్టేషన్‌ను బట్టి మారుతుంది. కాబట్టి బుకింగ్‌కు ముందు సీటు తప్పకుండా చెక్ చేయండి.