Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లాడు.. కట్ చేస్తే.. తెల్లారేసరికి!

Viral: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓయో హోటల్‌ గదిలో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Update: 2026-07-10 01:59 GMT

Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లాడు.. కట్ చేస్తే.. తెల్లారేసరికి!

Viral: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఒక విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోహ్కా ప్రాంతంలోని ఒక ఓయో హోటల్‌లో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు షాదాబ్ షేక్, భిలాయ్‌లోని క్యాంప్ ప్రాంతానికి చెందినవాడని, అతను వృత్తిరీత్యా డిజేగా పనిచేస్తున్నాడని గుర్తించారు.

ఆ రాత్రి ఏం జరిగింది?

నివేదికల ప్రకారం, షాదాబ్ బుధవారం సాయంత్రం తన 23 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి హోటల్‌కు వచ్చాడు. రాత్రి సమయంలో షాదాబ్‌కు అతని మాజీ ప్రేయసి నుంచి ఫోన్ రావడంతో ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్‌తో వాగ్వాదం మొదలైంది. ఇద్దరు కలిసి మద్యం సేవించడంతో ఆ గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత యువతి నిద్రలోకి జారుకుంది. ఇంతలో షాదాబ్, గదిలో ఉన్న చున్నీ ఉపయోగించి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గొడవ విషయం తెలుసుకుని రాత్రి 11 గంటల సమయంలో షాదాబ్ స్నేహితులు అక్కడికి చేరుకున్నా.. ఏ ప్రయోజనం లేకపోయింది. మరుసటి రోజు ఉదయం యువతికి స్పృహ రాగానే, గుట్టు చప్పుడు కాకుండా హోటల్ సిబ్బందికి కట్టుకథ చెప్పి వెళ్లిపోయింది. ఆపై స్నేహితుల ఎంట్రీతో అసలు విషయం బయటకొచ్చింది.

కాగా, ప్రస్తుతం పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. హోటల్ సిబ్బంది, మృతుడి పరిచయస్తులను కూడా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివాదానికి అసలు కారణాలు, ఆ రాత్రి గదిలో జరిగిన పూర్తి పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Tags:    

Similar News