Suryapet: తాటిచెట్టుపై హార్ట్ ఎటాక్: తాటిచెట్టు పైనే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న
Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో విషాదం. తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన చామకూరి వెంకన్న.
Suryapet: తాటిచెట్టుపై హార్ట్ ఎటాక్: తాటిచెట్టు పైనే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న
సూర్యాపేట: మంగళవారం ఉదయం తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. యధావిధిగా తాటిచెట్టు ఎక్కి తాడు గీస్తున్న క్రమంలో తాటిపైనే గుండెపోటుకు గురై మద్దిరాల గ్రామానికి చెందిన చామకూరి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. తాటివనంలో పనికి వెళ్లిన రైతులు బావి వద్దకు వెళ్తుండగా వెంకన్న తాటిచెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. జేసీబీ, క్రేన్ సాయంతో తాడు బిగించి ఆయన మృతదేహాన్ని దించారు.
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో మద్దిరాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.