Kodad: 21 మందికి కొత్త పెన్షన్ల పత్రాలు అందజేత.. మున్సిపల్ చైర్మన్!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెం 3వ వార్డులో నూతనంగా మంజూరైన 21 మందికి పెన్షన్ పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు.
Kodad: 21 మందికి కొత్త పెన్షన్ల పత్రాలు అందజేత.. మున్సిపల్ చైర్మన్!
Kodad: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెం 3వ వార్డులో బుధవారం నూతనంగా మంజూరైన పెన్షన్ల పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వార్డుకు చెందిన 21 మంది లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, 3వ వార్డు కౌన్సిలర్ వంగూరి గోపి తదితరులు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, కనగాల రాధాకృష్ణ, కనగాల వెంకట్రామయ్య, ఆర్.కె. రంగారెడ్డి, కనకయ్య, మందరపు రామారావు, బొల్లు కోటేశ్వరరావు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.