Miryalaguda: మిర్యాలగూడ ఎస్‌బీఐ శాఖలో రూ.15.36 కోట్ల రుణాల కుంభకోణం!
Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో ముగ్గురు కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన రుణాల్లో రూ.15.36 కోట్ల భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
Miryalaguda: మిర్యాలగూడ ఎస్‌బీఐ శాఖలో రూ.15.36 కోట్ల రుణాల కుంభకోణం!
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో ముగ్గురు కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన రుణాల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో మూడు ఖాతాల్లో రూ.15.36 కోట్ల బకాయిలు పేరుకుపోగా, రూ.3.30 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ గుర్తించారు. ఈ వ్యవహారంపై ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ పద్మజారెడ్డి మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.