Nalgonda: చేనేత వస్త్రాలు ధరించి కార్మికులకు చేయూతనివ్వాలి కలెక్టర్
Nalgonda: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్గొండ ఐటీ టవర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
Nalgonda: చేనేత వస్త్రాలు ధరించి కార్మికులకు చేయూతనివ్వాలి కలెక్టర్
నల్గొండ: స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన చేనేత రంగాన్ని ప్రోత్సహించి, చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా కార్మికులకు చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
1905 లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న "జాతీయ చేనేత దినోత్సవం" నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు.