Nalgonda: నల్గొండ భూ సమస్యల పరిష్కారానికే భూముల రీ-సర్వే

Nalgonda: వద్దిపాముల గ్రామంలో భూ రీ-సర్వే గ్రామసభ. భూదార్ నంబర్ ప్రాముఖ్యతను వివరించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్. సమస్యలు లేని భూ హక్కులే ప్రభుత్వ ధ్యేయం.

Update: 2026-07-17 10:31 GMT

Nalgonda: నల్గొండ భూ సమస్యల పరిష్కారానికే భూముల రీ-సర్వే

నల్గొండ: రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికే “భూముల రీ సర్వే” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.ఆయన నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం, వద్దిపాముల గ్రామంలో భూ రీ సర్వే పై ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు.గ్రామంలో కొంతమంది రైతులు బాటలు , దారుల సమస్య ,పట్టాలు లేకపోవడం భూమి ఉన్న కబ్జాలో లేకపోవడం వంటి సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భూములకు సంబంధించిన రికార్డులను అప్డేట్ చేస్తూ వస్తున్నప్పటికీ నక్ష,టీపన్ వంటి వాటిలో మార్పులు లేకపోవడం, అలాగే కాగితాలపై ఉన్నవారు క్షేత్రస్థాయిలో వారి భూములు తెలియకపోవడం, మోకాపై ఉన్నప్పటికీ సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాలను ప్రభుత్వం గుర్తించి అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు భూముల రీ సర్వ్ చేయిస్తున్నట్లు తెలిపారు.

భూ రీ సర్వేలో భాగంగా రైతులకు సంబంధించిన ప్రతి కమతాన్ని సర్వే చేయడం జరుగుతుందని, ముందుగా సర్వే ద్వారా గ్రామానికి సంబంధించిన హద్దులను నిర్ణయించడం అనంతరం గ్రామ ఆస్తులను సర్వే చేస్తారని ,అలాగే వ్యవసాఏతర భూములను సర్వే చేస్తారని తెలిపారు.రైతులు, గ్రామస్థుల సమక్షంలో సర్వేయర్ ద్వారా వ్యవసాయ భూములను సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు.

పహానిలో ఎవరున్నారో పరిశీలిస్తూ సర్వే చేయడం జరుగుతుందని, అనంతరం ఆ రైతుకు ల్యాండ్ పార్సెల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని, ఒక రైతుకు ఒకే పార్సల్ ఉండాల్సిన అవసరం లేదని, ఒక రైతుకు 3 లేదా 4 ల్యాండ్ పార్సిల్స్ ఉండొచ్చని, వీటన్నిటిని కలిపి భూదార్ నంబర్ కేటాయించడం జరుగుతుందన్నారు.

భూదార్ ఆధారంగానే భూముల వివరాలు తెలుసుకోవచ్చని, ఈ నెంబర్ కేటాయింపు అనంతరం గ్రామంలో ముసాయిదా జాబితాను ప్రచురించడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలను స్వీకరించి అనంతరం తుది జాబితాను తయారుచేసి ప్రకటించడం జరుగుతుందన్నారు. భూముల రీ సర్వే సందర్భంగా కోర్టు కేసులు, ఎఫ్ఐఆర్ కేసులు ,ఇవన్నీ కూడా ప్రదర్శించి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే భూముల హద్దులు నిర్ణయించి మ్యాపు నక్ష ఇవ్వడం జరుగుతుందన్నారు.

భూముల రీ సర్వే ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, అయితే గ్రామంలోని రైతులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో ఆలోచించి రిసర్వే త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఈ సర్వే ద్వారా కొత్త సమస్యలు రాకూడదని ఎలాంటి తగాదాలు గ్రామాలలో తలెత్త కూడదని కలెక్టర్ కోరారు.నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ మాధవరావు, సర్పంచు సురేందర్ రెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డి .శంకర్ రెడ్డి, ఎంపీడీవో రజిత, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News