Nalgonda: పరివాహక ప్రాంతాలకు ఊరట.. 10 టీఎంసీల నీరు విడుదల
Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు అధికారులు తాగునీటిని విడుదల చేశారు. రాబోయే 15 రోజుల పాటు నిరంతరాయంగా 10 టీఎంసీల నీటిని వదలనున్నారు.
Nalgonda: పరివాహక ప్రాంతాలకు ఊరట.. 10 టీఎంసీల నీరు విడుదల
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు అధికారులు తాగునీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 10 టీఎంసీల నీటిని రాబోయే 15 రోజుల పాటు నిరంతరాయంగా కుడి కాలువకు వదలనున్నారు. ఈ నీటి ద్వారా కాలువ పరిధిలోని ప్రధాన చెరువులు, జలాశయాలను నింపనున్నారు.
తద్వారా వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరివాహక ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. నీటి వృధాను అరికట్టేందుకు అధికారులు కాలువ వెంట గస్తీని ముమ్మరం చేశారు.