Nakrekal: 559 మందికి కొత్త పెన్షన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే వేముల!

Nakrekal: నకిరేకల్ పట్టణానికి నూతనంగా మంజూరైన 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల ఫలితంగానే ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు నేడు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల మందికి నూతన పెన్షన్లు మంజూరు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గతంలో కుటుంబంలో భర్త మరణిస్తే భార్యకు పెన్షన్ మంజూరు కావడానికి కొన్నిసార్లు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం అలాంటి ఇబ్బందులకు తావులేకుండా అర్హులకు త్వరితగతిన పెన్షన్లు మంజూరు చేస్తోందని అన్నారు.

వృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో నూతన పెన్షన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఏళ్ల తరబడి ఎదురుచూసిన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు కావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.

Tags: