Nalgonda: రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించండి: మంత్రి !
Nalgonda: నల్లగొండ సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Nalgonda: రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించండి: మంత్రి !
Nalgonda: నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సాగవుతున్న విస్తీర్ణంతో పాటు మరో లక్షన్నర ఎకరాల్లో ఆరుతడి పంటలు, కూరగాయల సాగు అయ్యేలా రైతుల్లో విస్తృత చైతన్యం తీసుకురావాలన్నారు.
ఎల్ నినో ప్రభావంతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోకుండా ఉండాలంటే తక్కువ నీటితో పండే పంటలే శ్రేయస్కరమని స్పష్టం చేశారు. రాబోయే రెండు, మూడు నెలల కాలం వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంటూ, ఎక్కువ మంది రైతులు ఆరుతడి పంటలు వేసేలా కష్టపడి పని చేయాలని నిర్దేశించారు.