Nalgonda: చింతపల్లి సాయిబాబా సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: ప్రత్యేక పూజలు, గోసేవ!

Nalgonda: నల్గొండ జిల్లా చింతపల్లిలో శ్రీ సాయిబాబా మందిరాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దర్శించుకున్నారు. గోపూజ నిర్వహించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు.

Update: 2026-04-30 05:41 GMT

Nalgonda: చింతపల్లి సాయిబాబా సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: ప్రత్యేక పూజలు, గోసేవ!

చింతపల్లి (నల్గొండ): నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి లోని సాయిబాబా మందిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు.

ముందుగా సాయిబాబా ఆలయం చేరుకున్న మంత్రి కి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మందిర పాలక వర్గ సభ్యులు,స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి,శాలువాలతో సత్కరించారు.

గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గోవుల పోషణపై ఆలయ పాలక వర్గాన్ని మంత్రి ఆరా తీశారు.అనంతరం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు.ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News