Suryapet: సూర్యాపేటలో కారు దిగి హస్తం గూటికి కార్యకర్తలు జంప్!
Suryapet: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్. సుమారు 50 మంది కార్యకర్తలు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Suryapet: సూర్యాపేటలో కారు దిగి హస్తం గూటికి కార్యకర్తలు జంప్!
సూర్యాపేట: పెన్‌పహాడ్ మండలంలో శనివారం కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. పెన్‌పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
సూర్యాపేటలోని వైట్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు సమక్షంలో దొంగరి మహేందర్ సహా ఇతర కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు నారాయణ ప్రవీణ్ రెడ్డి, గజ్జెల సైదిరెడ్డి, నకిరేకంటి వెంకన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండేటి బిక్షం రెడ్డి, మాజీ ఎంపీటీసీ గద్దల నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు సద్దల నాగేశ్వరావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్లెల వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, సిద్దు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం ఉంటుందని తెలిపారు.