Sai Pallavi: ఎవరు తల్లి నువ్వు సాయి పల్లవినే డామినేట్ చేశావు..!

Sai Pallavi: రణబీర్ కపూర్, సాయి పల్లవిల 'రామాయణం' ట్రైలర్‌లో సీతమ్మ వెనక కనిపించిన సురభి దాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

Update: 2026-08-01 07:08 GMT

Sai Pallavi: ఎవరు తల్లి నువ్వు సాయి పల్లవినే డామినేట్ చేశావు..!

Surabhi Das: భారతీయ చిత్రసీమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ 'రామాయణం'. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడుగా, యష్ రావణుడుగా, సాయి పల్లవి సీతగా, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ నెట్టింట తుఫాన్ రేపుతోంది. అయితే, ఈ ట్రైలర్‌లో రాముడు, రావణుడు, సీతమ్మ పాత్రలతో పాటు మరో ముఖం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ట్రైలర్‌లో సీత దేవిగా నటిస్తున్న సాయి పల్లవి వెనుక నిలబడి ఉన్న ఒక యువతిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో సెర్చింగ్ నడుస్తోంది. ఎవరీ బ్యూటీ? అంటూ నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. ఆమె మరెవరో కాదు... ప్రముఖ నటి సురభి దాస్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సురభి దాస్ శ్రుతకీర్తి పాత్రలో కనిపించబోతున్నారు. పురాణాల ప్రకారం శ్రుతకీర్తి సీతమ్మకు చిన్న చెల్లెలు, అలాగే శత్రుఘ్నుడి భార్య.

దీనిపై సురభి దాస్ స్పందిస్తూ.. నేను రామాయణంలో ఊర్మిళ పాత్ర చేయడం లేదు. సీతమ్మ చిన్న చెల్లెలైన శ్రుతకీర్తి పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్. ఈ విశ్వరూప దృశ్యకావ్యంలో భాగం కావడం నా అదృష్టం అని ఆనందం వ్యక్తం చేశారామె. అస్సామీ చిత్ర పరిశ్రమ ద్వారా నటిగా ప్రయాణం ప్రారంభించిన సురభి దాస్, అనతి కాలంలోనే హిందీ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సూపర్‌హిట్ కలర్స్ టీవీ సీరియల్‌లో శీర్షికా పాత్ర పోషించి హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్ ప్లస్ ప్రముఖ ధారావాహిక పాండ్యా స్టోర్‌లో కీలక పాత్ర ద్వారా విశేషమైన ఆదరణ పొందారు.

ముంబైకి వచ్చి బుల్లితెరపై సత్తా చాటిన ఈ అస్సామీ భామకు, ఇప్పుడు రణబీర్-సాయి పల్లవిల 'రామాయణం' చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త మైలురాయిగా నిలవబోతోంది. ట్రైలర్‌లోనే తన పసిడి మెరుపులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సురభి, వెండితెరపై ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.



Tags:    

Similar News