Varanasi: వారణాసి మూవీ అప్డేట్ అడిగిన ఫ్యాన్.. కట్ చేస్తే.. రిప్లై చూడగా దిమ్మతిరిగింది.!
Varanasi: 'వారణాసి' అప్డేట్ ఇవ్వకపోతే పెళ్లి అవదని ట్యాగ్ చేసిన అభిమానికి, 'నాకు అల్రెడీ పెళ్లి అయిందిలేరా' అని సినిమా అఫీషియల్ ఖాతా అడ్మిన్ సరదాగా రిప్లై ఇచ్చాడు.
Varanasi: వారణాసి మూవీ అప్డేట్ అడిగిన ఫ్యాన్.. కట్ చేస్తే.. రిప్లై చూడగా దిమ్మతిరిగింది.!
Varanasi: రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'వారణాసి' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మూవీ నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్.. అప్డేట్ ఇవ్వకపోతే నీకు పెళ్లి అవదు అంటూ వారణాసి అఫీషియల్ అకౌంట్‌ను Xలో ట్యాగ్ చేశాడు. అయితే 'నాకు అల్రెడీ పెళ్లి అయిందిలేరా' అంటూ అడ్మిన్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీంతో కనీసం అప్డేట్ ఎప్పుడిస్తారో చెప్పమని ఆ ఫ్యాన్ నిట్టూర్చాడు.
సోషల్ మీడియాలో ఈ సరదా సంభాషణ వైరల్ అయింది. ఎంతో కాలంగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఇది అద్దం పడుతోంది. 'వారణాసి' నుంచి ఏ చిన్న పోస్టర్ లేదా గ్లింప్స్ వచ్చినా కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్ అవుతుంది. అందుకే అభిమానులు తరచూ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ వివరాలు అడుగుతుంటారు. కొన్నిసార్లు ఇలాంటి సరదా వ్యాఖ్యలు, బెదిరింపులు చేస్తుంటారు.
సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ కొన్ని వారాల క్రితం ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా పూర్తి కావడానికి నాలుగైదు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ఆయన IANSతో చెప్పారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది ముగిసే సరికి, అంటే జనవరి నాటికి అన్నీ పూర్తవుతాయని తెలిపారు.
'వారణాసి'లో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది టైమ్ ట్రావెల్ అంశంతో పాటు హిందూ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా. సినిమాను IMAX ఫార్మాట్ కోసం ప్రీమియం లార్జ్ స్కేల్లో చిత్రీకరిస్తున్నారు.
చిత్రబృందం గతేడాది నవంబర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ ఈవెంట్లో సినిమా టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టులో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రుద్ర పాత్ర కొత్త ఫొటోలు వచ్చాయి. అవి కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా పెద్ద అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఏప్రిల్ 7, 2027లో విడుదల కానుంది.