Mahesh Babu: ఎవరు ఊహించని దర్శకుడితో చేతులు కలపనున్న మహేష్ బాబు!
SSMB 30: దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ఆవేశం’ ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వంలో #SSMB30 చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Mahesh Babu: ఎవరు ఊహించని దర్శకుడితో చేతులు కలపనున్న మహేష్ బాబు!
SSMB 30: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్ తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే, మహేష్ బాబు తదుపరి సినిమా గురించి టాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.
మలయాళంలో ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి విభిన్నమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతు మాధవన్, మహేష్ బాబు తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తనదైన మేకింగ్, ఎంటర్టైనింగ్ కథనాలతో యూత్‌ను కట్టిపడేసే జీతు మాధవన్.. మహేష్ బాబును ఎలాంటి కొత్త కోణంలో చూపిస్తారోనని అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ‘శ్రీమంతుడు’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలతో మహేష్ బాబుతో కలిసి పనిచేసిన మైత్రీ సంస్థ, మరోసారి సూపర్‌స్టార్‌తో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్న మహేష్ బాబు, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే తన తదుపరి సినిమాపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 2027 మధ్య భాగం తర్వాత #SSMB30 సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 2028 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, మహేష్ బాబు – జీతు మాధవన్ కాంబినేషన్‌పై చిత్రబృందం లేదా నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కితే, రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ తర్వాత మహేష్ అభిమానులకు మరో సరికొత్త సినిమాటిక్ ట్రీట్ ఖాయమనే చెప్పాలి.