Indian Box Office: ఈ సినిమాకు రూ. 462 కోట్లు రావడం ఏంట్రా..!

Indian Box Office: హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' భారత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.

Update: 2026-08-10 04:44 GMT

Indian Box Office: ఈ సినిమాకు రూ. 462 కోట్లు రావడం ఏంట్రా..!

Spider-Man Brand New Day : ఇక్కడ తీసిన సినిమాలే.. కలెక్షన్లు రాబట్టలేక నానాతంటాలు పడుతుంటే..ఓ హాలీవుడ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌పై దాడి చేస్తుంది. హాలీవుడ్ సూపర్‌హీరో చిత్రం "స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే" భారత బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్లలో విడుదలైన క్షణం నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా నిలిచి ఆల్ టైమ్ రికార్డును తన పేరిట తిరగరాసింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు భారత మార్కెట్‌లో ఏకంగా రూ. 462 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ భారీ వసూళ్లతో జేమ్స్ కేమరూన్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరిట ఉన్న రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.

భారతీయ ప్రేక్షకులలో, ముఖ్యంగా యూత్‌లో స్పైడర్ మ్యాన్ పాత్రకు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, భావోద్వేగాలతో కూడిన బలమైన కథనం ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. వీకెండ్లతో పాటు వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్లలో నిండుతున్న హౌస్‌ఫుల్ బోర్డులు ఈ సినిమా ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

భారతీయ ప్రేక్షకులు సూపర్‌హీరో కథలకు, నాణ్యమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌కు ఎంత పెద్దపీట వేస్తారో ఈ గ్రాండ్ సక్సెస్ నిరూపించింది. ప్రస్తుతం థియేటర్లలో స్పైడర్ మ్యాన్ జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. "స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే" ద్వారా మార్వెల్ మళ్ళీ తీసుకువచ్చిన గ్రాండ్ విజువల్స్ , కథనంలోని యాక్షన్ ఎలిమెంట్స్ ఎంత ఆకట్టుకునేలా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది.



 


Tags:    

Similar News